అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మొలకలచెరువు ఎస్ఐ నరసింహుడు తెలిపిన వివరాలు ప్రకారం వేపూరికోట పంచాయితీ కట్టావాండ్లపల్లికి చెందిన వెంకటేష్(26), తరుణ్(24), మనోజ్(19) ద్విచక్ర వాహనంలో మొలకలచెరువుకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా కదిరి నుంచీ మదనపల్లె వైపు వస్తున్న పుంగనూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. ములకలచెరువు నుంచీ స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ముగ్గరిని కదిరి-మదనపల్లె జాతీయరహదారి ములకలచెరువు మండలం పెద్దపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతున్న ఓబులేసు కుమారుడు మనోజ్, డిగ్రీ పూర్తిచేసిన చంద్రప్ప కుమారుడు వెంకటేష్, ఐటీఐ పూర్తిచేసిన వేమనారాయణ కుమారుడు తరుణ్.. ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.