SHARMILA: జగన్ ఇంకా ఎందుకా మౌనం

మద్యం కుంభకోణంపై షర్మిల ఆగ్రహం... కుట్రలు పూర్తిగా వెలికితీయాలని డిమాండ్... సిట్ పైనా విమర్శలు చేసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్;

Update: 2025-07-25 03:00 GMT

వై­సీ­పీ ప్ర­భు­త్వ పా­ల­న­లో జరి­గిన మద్యం కుం­భ­కో­ణం వె­నుక దాగి ఉన్న కు­ట్ర­లు పూ­ర్తి­గా వె­లి­కి తీ­యా­ల­ని కూ­ట­మి ప్ర­భు­త్వా­న్ని ఏపీ పీ­సీ­సీ అధ్య­క్షు­రా­లు వై­ఎ­స్ షర్మిల డి­మాం­డ్ చే­శా­రు. వి­జ­య­వా­డ­లో పీ­సీ­సీ అధ్య­క్షు­రా­లు వై­ఎ­స్ షర్మిల వి­లే­క­ర్ల­తో మా­ట్లా­డు­తూ.. మద్యం కుం­భ­కో­ణం­పై స్పం­ది­స్తూ వై­సీ­పీ అధి­నేత, మాజీ సీఎం వై­ఎ­స్ జగ­న్‌­పై తీ­వ్ర వ్యా­ఖ్య­లు చే­శా­రు. మద్యం కుం­భ­కో­ణం వ్య­వ­హా­రం­పై వి­చా­రణ జరు­పు­తు­న్న సి­ట్‌­పై­నా వి­మ­ర్శ­లు గు­ప్పిం­చా­రు. సిట్ పద్ద­తి చూ­స్తే కొం­డ­ను తవ్వి ఎలు­క­ను పట్టిన చం­దం­గా ఉం­ద­న్నా­రు. డి­స్ట­ల­రీల వద్ద కమీ­ష­న్‌­లు, బి­నా­మీ­లు, నగదు రవా­ణా అం­శా­ల­తో­పా­టు వై­ఎ­స్ జగ­న్‌­కి నె­ల­కు రూ. 60 కో­ట్లు అం­దే­వ­ని మా­త్ర­మే సిట్ అధి­కా­రు­లు చె­బు­తు­న్నా­ర­న్నా­రు. దీం­తో ఈ మద్యం కుం­భ­కో­ణం­లో తయా­రీ నుం­చి చివర వి­క్ర­యాల వరకు అవి­నీ­తి జరి­గిం­ద­నే­ది అర్థ­మ­వు­తుం­ద­ని స్ప­ష్టం చే­శా­రు. ప్ర­పం­చం­లో ఎక్క­డా లేని వి­ధం­గా ఈ డి­జి­ట­ల్ యు­గం­లో సైతం కే­వ­లం నగదు రూ­పం­లో మద్యం వి­క్ర­యా­లు జరి­పా­ర­ని చె­ప్పా­రు. రిషి కొం­డ­ను ఎం­దు­కు తవ్వా­రో కూడా ఇంత వరకు వై­ఎ­స్ జగన్ సమా­ధా­నం చె­ప్ప­లే­ద­న్నా­రు. వి­వే­కా హత్య­లో సా­క్షి హా­ర్ట్ ఎటా­క్ అని ఎం­దు­కు చె­ప్పిం­దో తె­లి­య­లే­ద­న్నా­రు. జగన్ అసలు అం­శా­ల­ను మరు­గున పె­ట్టి.. మభ్య­పె­ట్టి మా­ట్లా­డ­టం­లో ది­ట్ట అని వై­ఎ­స్ షర్మిల తె­లి­పా­రు.

బ్లాక్ మనీ కోసమే..!

కే­వ­లం బ్లా­క్ మనీ‌ కో­స­మే డి­జి­ట­ల్ పే­మెం­ట్ల­ను ని­లి­పి వే­శా­ర­ని షర్మిల ఆరో­పిం­చా­రు. ప్ర­పం­చం­లో ఎక్క­డా లేని వి­ధం­గా నా­టి‌ ప్ర­భు­త్వం చే­సిన ఆర్థిక నే­రం­గా ఈ మద్యం వి­క్ర­యా­ల­ను ఆమె అభి­వ­ర్ణిం­చా­రు. రూ. 3, 500 కో­ట్లు మద్యం కుం­భ­కో­ణం ఒక్క­టే కాదు.. పన్ను­లు ఎగ్గొ­ట్టా­ల­నే క్యా­ష్ పరం­గా ఈ వి­క్ర­యా­లు జరి­పా­ర­ని వి­మ­ర్శిం­చా­రు. ఈ మొ­త్తం వ్య­వ­హా­రం­పై పూ­ర్తి­గా వి­చా­రణ జర­గా­ల­ని ఆమె పే­ర్కొ­న్నా­రు. చి­వ­ర­కు నాన్ డ్యూ­టీ పే­మెం­ట్లు మొ­త్తం బ్లా­క్‌­లో­నే జరి­గా­య­ని చె­ప్పా­రు. ఈ మొ­త్తం వ్య­వ­హా­రం­పై వి­చా­రణ జర­పా­ల­ని సీఎం చం­ద్ర­బా­బు­ను ఈ సం­ద­ర్భం­గా ఆమె డి­మాం­డ్ చే­శా­రు. ప్ర­ధా­ని మో­దీ­కి వై­ఎ­స్ జగ­న్మో­హ­న్ రె­డ్డి ఇంకా దత్త పు­త్రు­డు­గా­నే ఉన్నా­ర­ని వ్యం­గ్యం­గా అన్నా­రు. వై­ఎ­స్ఆ­ర్ వ్య­తి­రే­కిం­చిన బీ­జే­పీ­కి వై­ఎ­స్ జగన్ ఊడి­గం చే­శా­ర­ని మం­డి­ప­డ్డా­రు. గత ప్ర­భు­త్వ హయాం­లో అనేక ప్రా­జె­క్టు­ల­ను అదా­నీ­కి వై­ఎ­స్ జగన్ అడ్డ­గో­లు­గా కట్టె­బె­ట్టా­ర­ని గు­ర్తు చే­శా­రు. బీ­జే­పీ­కి వై­ఎ­స్ జగన్ ఎప్ప­టి­కీ దత్త పు­త్రు­డే­న­ని వై­ఎ­స్ షర్మిల కుండ బద్ద­లు కొ­ట్టా­రు. చీప్ లి­క్క­ర్ తయా­రీ­ని ఎం­దు­కు ప్రో­త్స­హిం­చా­ర­ని జగన్ ను వై­ఎ­స్ షర్మిల సూ­టి­గా ప్ర­శ్నిం­చా­రు.

Tags:    

Similar News