తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లో అడుగు పెట్టక ముందే వైసీపీ నేతలు భయపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అది భయమా, బెదురా వాళ్లకే తెలియాలి అంటూ వైసీపీపై ఆమె విమర్శలు కురిపించారు. తన కుమారుడు వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడేనని షర్మిల స్పష్టం చేశారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గోలపెట్టినా నా కొడుకే వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడు. ఎంత మంది మొత్తుకున్నా దీన్ని మార్చలేరు’ అని షర్మిల స్పష్టం చేశారు. ‘నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టలేదు. అప్పుడే వైసీపీ ఇంతలా స్పందిస్తుంటే ఇది భయమే అన్నారు. తన తండ్రే రాజారెడ్డి అని తన కుమారుడికి పేరు పెట్టారని ఆమె తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో పాటు తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ‘వైసీపీ సైతాను సైన్యం ఎంత అరిచి గీపెట్టినా నా కొడుకు పేరు రాజారెడ్డే.. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేవు.. ’ అని షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు చెబితేనే నా కొడుకు రాజకీయాల్లో వస్తున్నారని ఓ వీడియో మార్ఫింగ్ చేశారు. దీనిని చూస్తే తనకు చాలా నవ్వొచ్చిందని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు చెప్తే నా కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొస్తే ...మరి ఎవరు చెపితే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్ వాదికి మద్దతిచ్చారో జగన్ సమాధానం చెప్పాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు.