Kodali Nani : కొడాలి నానికి షాక్.. వైజాగ్‌లో కేసు నమోదు

Update: 2024-11-18 11:15 GMT

YCP ఫైర్‌ బ్రాండ్‌, చంద్రబాబుపై ఓ రేంజ్ లో రెచ్చిపోయే కొడాలినానికి బిగ్‌ షాక్‌ తగిలింది. విశాఖలో ఆయనపై కేసు నమోదయ్యింది. విశాఖకు చెందిన ఒక న్యాయ విద్యార్ధిని సత్యాల వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కొడాలినాని పై ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో గత ఐదేళ్లుగా కొడాలి నాని పత్రికా ప్రకటనలలో, అసెంబ్లీ సమావేశాలలో వాడిన భాషపై ఆమె ఫిర్యాదు చేశారు. అధికారిక కార్యక్రమాలలో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌‌పై అవమానకరమైన రీతిలో అసభ్య పదజాలం ఉపయోగించారన్నారు. దుర్భాషలాడుతూ, వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని కంప్లైంట్‌ చేశారు. దీంతో విశాఖ త్రీ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Tags:    

Similar News