అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం... ఐ పోలవరం మండలం, మురమళ్ళలో216 జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ఓ షాపులో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో షాపు పూర్తిగా దగ్ధమైంది... స్థానికులు వెంటనే ఫైర్ ఆఫీస్‌కు సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురై, సంఘటనా స్థలం నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాక పోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ లీక్‌కు గల కారణాలను ఆరా తీస్తున్నారు.