YSRCP Minister : లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు.. వైసీపీ మాజీ మంత్రికి నోటీసులు
ఏపీలో లిక్కర్ స్కామ్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో మిథున్ రెడ్డిని కీలక సూత్రధారిగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మిథున్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ కోర్టు నిరాకరించింది. అయితే ఆయన్ని అరెస్ట్ చేయొద్దని చెప్పింది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేసిన నారాయణ స్వామి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసుల్లో స్పష్టం చేసింది.
కాగా లిక్కర్ స్కామ్‌లో మొత్తం 49మందిని సిట్ నిందితులుగా చేర్చింది. ఏ1గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏ2 దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి, ఏ3గా దొడ్డ వెంకట సత్యప్రసాద్, ఏ4గా మిథున్ రెడ్డి, ఏ5 మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఏ6 సజ్జల శ్రీధర్ రెడ్డి, సహా పలువురిని నిందితులుగా చేర్చింది. ఈ కేసుకు సంబంధించి ఇవాళ కోర్టులో సిట్ ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు అంశాలు, సాక్ష్యాధారాలు, స్టెట్‌మెంట్లు, ఫోరెన్సిక్ రిపోర్ట్స్, బ్యాంకు లావాదేవీలను కోర్టుకు అందజేయనుంది.