నైపుణ్యం పోర్టల్‌పై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. అధికారులతో ఉండవల్లిలోని నివాసంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. దీనికి సంబంధించి లోకేశ్ ఓ ట్వీట్ చేశారు. ‘‘ఉద్యోగ, ఉపాధి కల్పనకు మిషన్ మోడ్ విధానంలో నైపుణ్యం పోర్టల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తాం. 90 రోజులపాటు ఈ కార్యక్రమం చేపడతాం. ఈ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా రెజ్యూమ్ సిద్ధమయ్యేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించాను. ఇటీవల ఢిల్లీ పర్యటన అనంతరం ఐటీఐల అభివృద్ధికి హబ్ అండ్ స్పోక్ విధానంలో కేంద్రం కార్యక్రమం ద్వారా రూ.600 కోట్లు కేటాయించాం’’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.