చంద్రబాబుని జైలుకు పంపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు : సోమిరెడ్డి
చంద్రబాబుని జైలుకు పంపడం ఆ దేవుడి వల్ల కూడా కాదన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం ఉందని ఆయన ద్వారా చంద్రబాబుకు నోటీసులు ఇప్పించారని మండిపడ్డారు.;
చంద్రబాబుని జైలుకు పంపడం ఆ దేవుడి వల్ల కూడా కాదన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం ఉందని ఆయన ద్వారా చంద్రబాబుకు నోటీసులు ఇప్పించారని మండిపడ్డారు. ఆయనేమైనా రాజధానికి భూములిచ్చారా అని ప్రశ్నించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనే పదమేలేదని హైకోర్టు చెప్పినా.. పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నోటీసులు ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ జైలుకి వెళ్లారు కాబట్టి ఏదో ఒక నేరంలో చంద్రబాబుని కూడా జైలుకు పంపాలనే ఆలోచనలో జగన్ ఉన్నారని విమర్శించారు. అసలు నేరమే లేనప్పుడు చంద్రబాబు నేరస్తుడెలా అవుతాడో సీఎం జగన్ చెప్పాలన్నారు.