Sugar Ganesha : చీమలు పట్టని చక్కెర గణపతి.. పవన్ పిలుపుతో ఏర్పాటు

Update: 2024-09-06 09:45 GMT

కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ జగన్నాథపురంలో గత పదేళ్ల నుంచి స్థానిక కమిటీ వినాయకుని ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈసారి వెరైటీగా ఆలోచించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణం కాపాడేందుకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడొద్దన్నారనీ.. దీనిని దృష్టిలో పెట్టుకుని వందల కేజీల పంచదార వినియోగించి మూడు రంగులతో 15 అడుగుల వినాయకుడి విగ్రహం తయారు చేయించారు.

ఈ విగ్రహం విశేషం తెలుసుకున్న జనం చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ చక్కెర గణపతికి ప్రత్యేకత ఉంది. ఈ విగ్రహానికి చీమలు పట్టవు. తడిసినా ఏమీ కాదు. పూర్తిగా పంచదార, మూడు రకాల రంగులు మాత్రమే వినియోగించినట్లు నిర్వాహకులు తెలిపారు. నిమజ్జనం రోజు దీనిని పంచిపెడతామని నిర్వాహకులు చెబుతున్నారు.

Tags:    

Similar News