ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ..!
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి భూములపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.;
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి భూములపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రియించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరి ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.