ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జగన్ కేసులను వేరే కోర్టుకు బదిలీ చేయడానికి నిరాకరించింది. జగన్ బెయిల్ రద్దు, వేరే ధర్మాసనానికి కేసు విచారణను బదిలీ చేయాలని గతంలో రఘురామ రాజు పిటిషన్ వేశారు. వీటిపై ప్రత్యేకంగా విచారణ జరపాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. కోర్టు అసహనం వ్యక్తం చేయడంతో తన పిటిషన్లను వెనక్కి తీసుకున్నారు రఘురామ కృష్ణం రాజు.