Andhra Pradesh: రూ.1100 కోట్ల కరోనా సహాయాన్ని దారి మళ్లించిన ఏపీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టు సీరియస్..
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వంపై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.;
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వంపై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం విషయంలో జగన్ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. 1100 కోట్ల కరోనా సహాయాన్ని దారి మళ్లించి మరోచోట ఖర్చు చేసినందుకు ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం తీవ్రంగా మందలించింది. పరిహారం అందించిన వివరాలతో మే 13లోగా అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఏపీ ప్రభుత్వం కరోనా సహాయం కోసం నిర్ణయించిన మొత్తాన్ని వేరే పథకాలకు ఖర్చు చేసిందని పిటిషనర్ ఆరోపించారు.