Andhra Pradesh : అధిక వడ్డీ చెల్లించలేదని దాడికి తెగబడిన నిందితుల అరెస్ట్

Update: 2025-08-01 06:30 GMT

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని శాంతినగర్ లో అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి వారు ఆ డబ్బు చెల్లించలేదని వడ్డీ వ్యాపారులు దాడి చేసిన కేసులో ఐదుగురు నిందితులను ధర్మవరం డిఎస్పి నర్సింగప్ప ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు ఎస్పి రత్న పేర్కొన్నారు. పుట్టపర్తి లోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. ధర్మవరం పట్టణం శాంతినగర్ కు చెందిన దేవరశెట్టి భారతి రమణ ఇంట్లోకి రాత్రివేళ చొరబడిన నిందితులు వారిపై దాడి చేసి 7వేల రూపాయల నగదు బలవంతంగా ఎత్తుకెళ్లిన ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల ఆచూకీ కోసం గాలిస్తుండగా ఈ నెల 30వ తేదీన ధర్మవరం కేతిరెడ్డి కాలనీ వద్ద ఐదుగురు నిందితులు మహేష్,హేమంత్ కుమార్, గోవర్ధన్, వినోద్ కుమార్ మనోహర్ ను అరెస్టు చేసినట్లు తెలియజేశారు. పరారీలో ఉన్న a1, a7 నిందితులు రాజు , విజయ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటే పోలీసులను సంప్రదించి వారి వివరాలు తెలియజేయవచ్చని ఎస్పీ సూచించారు. అధిక వడ్డీల పేరుతో పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారుల సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలియజేశారు.

Tags:    

Similar News