వివాదాస్పద ఐపిఎస్ అధికారి పివి సునీల్ మరోసారి కాంట్రవర్సీని క్రియేట్ చేశాడు. ఆయన మొదటినుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. వైసిపి హయాంలో రెచ్చిపోయి ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన అధికారిగా ఈయనకు పేరుంది. జగన్ మెప్పుకోసం ఇప్పుడున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును అప్పట్లో చిత్రహింసలు పెట్టిన చరిత్ర పీవీ సునీల్ కు ఉంది. జగన్ కళ్ళలో ఆనందం చూసేందుకే రఘురామపై అంత కఠినంగా వ్యవహరించారు అనేది ఓపెన్ సీక్రెట్. ఆ కేసులో ఇప్పుడు ఆయన విచారణ ఎదుర్కొంటున్నాడు. సస్పెన్షన్ లో ఉన్న ఆయన నిన్న మాట్లాడుతూ కాపు కులస్తులు సీఎంగా ఉంటే ఎస్సి నేతలు డిప్యూటీ సీఎంగా ఉండాలన్నారు. దానికి ఆయన ఇద్దరు పేర్లు కూడా చెప్పారు. మాజీ న్యాయమూర్తి జడాస్ రామ్ కుమార్, మాజీ ఎంపీ హర్ష కుమార్ లను డిప్యూటీ సీఎం గా చేయాలంటున్నాడు.
సస్పెన్షన్ లో ఉన్నా సరే సునీల్ కుమార్ ఒక ఐపీఎస్ అధికారి. ఆయన కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య భద్రంగా మాట్లాడాలి. అంతేకానీ ఇలా కురాలను రెచ్చగొట్టేలా మాట్లాడటం ఏంటి. ఎవరు డిప్యూటీ సీఎం గా ఉండాలి అనేది అధికారంలో ఉన్న పార్టీలు నిర్ణయిస్తాయి. అంతేగాని ఈయన చెప్పడమేంటి. దీని వెనక వైసిపి ఉందా అనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే జగన్ తన అధికారం పోయినప్పటి నుండి ఏపీలో అశాంతిని రాజేయాలని ఎన్నో కుట్రలు చేస్తున్నాడు. ఆయన కుట్రల్లో ఈ సునీల్ కుమార్ భాగమే అనే ప్రచారం మొదలైంది. ఎందుకంటే సునీల్ మొదటి నుంచి జగన్ మెప్పుకోసం ఏమైనా చేసే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు.
జగన్ హయాంలో ప్రమోషన్ల కోసం, డబ్బుల కోసం, తనకంటూ తిరుగులేని పవర్ రావాలనే ఉద్దేశంతో జగన్ ను మెప్పించేందుకు ఏది పడితే అది చేశారు. అమలాపురం ఎంపీగా పోటీ చేయాలనే కోరికను కొన్నిసార్లు బయటపెట్టాడు. మరి ఇప్పుడు దాని కోసమే జగన్ ను మెప్పించే పనిలో పడ్డారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్ గా జగన్ ఆదేశాలతో చాలామంది ఇలా కులాలను రెచ్చగొట్టే పనిలోపడ్డారు. కూటమి ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయ స్థాయి కంపెనీలు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఏపీ రూపురేఖలే మారిపోతున్నాయి. అన్ని కులాలకు సంక్షేమం, అభివృద్ధి అందుతుంది. కుల ప్రస్తావన లేని రాజకీయాలు ఏపీలో ఇప్పుడు చూస్తున్నాం. ఏపీ ఇంత ప్రశాంతంగా ఉండటం జగన్ కు బహుశా నచ్చట్లేదు. అందుకే పీవీ సునీల్ లాంటి వారిని ఎగదోసి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి.