LOKESH: తీపి కబురు..ఉగాదికి జాబ్ క్యాలెండర్

ఏపీ శాసనసభలో నారా లోకేశ్ ప్రకటన.. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల... అసెంబ్లీ వేదికగా ప్రకటించిన లోకేశ్

Update: 2026-02-23 10:00 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ శా­స­న­సభ సమా­వే­శా­ల్లో భా­గం­గా 8వ రోజు ప్ర­శ్నో­త్త­రాల సమ­యం­లో నారా లో­కే­శ్ కీలక ప్ర­క­టన చే­శా­రు. ఏపీ­లో­ని వి­ద్యా­వ్య­వ­స్థ, ని­రు­ద్యో­గుల సమ­స్య­ల­పై సభ్యు­లు అడి­గిన ప్ర­శ్న­ల­కు మం­త్రి నారా లో­కే­శ్ సమా­ధా­న­మి­చ్చా­రు. రా­ష్ట్రం­లో­ని ని­రు­ద్యో­గు­లు ఎంతో కా­లం­గా ఎదు­రు­చూ­స్తు­న్న జాబ్ క్యా­లెం­డ­ర్‌­ను ఉగా­ది పం­డుగ సం­ద­ర్భం­గా వి­డు­దల చే­స్తా­మ­ని మం­త్రి లో­కే­శ్ ప్ర­క­టిం­చా­రు. వి­శే­ష­మే­మి­టం­టే, ఈ జాబ్ క్యా­లెం­డ­ర్‌­లో­నే డీ­ఎ­స్సీ(DSC) పో­స్టు­ల­ను కూడా చే­ర్చ­ను­న్న­ట్లు ఆయన స్ప­ష్టం చే­శా­రు. ఇది ఉపా­ధ్యాయ వృ­త్తి­ని ఆశిం­చే వే­లా­ది మంది అభ్య­ర్థు­ల­కు పె­ద్ద ఊర­ట­ని­చ్చే అంశం. కస్తూ­ర్బా గాం­ధీ బా­లి­కా వి­ద్యా­ల­యాల(KGBV) పని­తీ­రు­పై ఆము­దా­ల­వ­లస ఎమ్మె­ల్యే కూన రవి­కు­మా­ర్, ఎమ్మె­ల్యే ము­ర­ళీ మో­హ­న్ పలు అం­శా­ల­ను ప్ర­స్తా­విం­చా­రు. ఏపీ­లో కే­జీ­బీ­వీ పా­ఠ­శా­ల­ల్లో 6 నుం­చి 10వ తర­గ­తి­తో పాటు ఇం­ట­ర్మీ­డి­య­ట్ కూడా అం­ది­స్తు­న్నా­ర­ని, ఇక్కడ పని­చే­స్తు­న్న వా­రి­కి ఎం­టి­ఎ­స్(MTS) అమలు చే­యా­ల­ని, రె­గ్యు­ల­ర్ ప్రి­న్సి­పా­ళ్ల­ను ని­య­మిం­చా­ల­ని కో­రా­రు. దీ­ని­కి మం­త్రి నారా లో­కే­శ్ సమా­ధా­న­మి­స్తూ.. ఇతర రా­ష్ట్రాల కంటే ఏపీ­లో కే­జీ­బీ­వీ­ల­కు ఎక్కువ డి­మాం­డ్ ఉం­ద­ని, అడ్మి­ష­న్ల కోసం తీ­వ్ర­మైన పోటీ నె­ల­కొం­ద­ని తె­లి­పా­రు. జీ­తాల పెం­పు­ద­ల­పై కేం­ద్ర ప్ర­భు­త్వం­తో చర్చిం­చా­మ­ని, కేం­ద్రం సహ­కా­రం అం­ది­స్తే మరి­న్ని చర్య­లు చే­ప­డ­తా­మ­ని హామీ ఇచ్చా­రు.

పాలిటెక్నిక్, ఐటీఐ విద్య బలోపేతం

ఉన్నత విద్యలో ఇంజనీరింగ్‌తో పాటు పాలిటెక్నిక్, ఐటీఐల ప్రాధాన్యాన్ని మంత్రి వివరించారు. ఉత్తరాంధ్రలో ఏర్పడుతున్న పారిశ్రామిక ఎకో సిస్టమ్‌కు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. విజయనగరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మరమ్మతులను 'క్లస్టర్ బేస్డ్ అప్రోచ్' ద్వారా వచ్చే ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. డీఎస్సీపై విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ చేసిన ప్రకటన ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురు చూస్తోన్న అభ్యర్థుల్లో మరింత ఆశలు రేపింది. త్వరలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని, అందులో డీఎస్సీ ఉంటుందని అసెంబ్లీలో మంత్రి వెల్లడించారు. దీంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత వైకాపా పాలనలో ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు. ఎన్నికల ముందు 6 వేల పోస్టులతో ప్రకటించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో నిరుద్యోగులు పలుమార్లు రోడ్డెక్కి దర్నాలు, నిరసనలు చేసిన దాఖలాలున్నాయి. కూటమి పార్టీలు ఎన్నికల ముందు మెగా డీఎస్సీని ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే 16 వేల పోస్టులతో ప్రకటన ఇచ్చింది. అనేకమంది ఉపాధ్యాయ కొలువులు సాధించారు.

Tags:    

Similar News