Tirumala Laddu Ghee Controversy : శాసనసభలో కల్తీ నెయ్యిపై చర్చ.. వైసిపికి ఆ ధైర్యం ఉందా..?
ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన తిరుమల లడ్డు కల్తీ నెయ్యి ఇష్యూ ఏ స్థాయిలో చర్చనీయాంశంగా మారిందో మనందరికీ తెలిసిందే. ఈ కల్తీ నెయ్యి అంశం మీద సిబిఐ నియమించిన సిట్ స్వయంగా నివేదికలో చెప్పింది. ఒక్క చుక్క పాలు లేకుండానే కెమికల్ తో నెయ్యిని తయారు చేసి లడ్డూలో కలిపారు అంటూ. అయినా సరే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైసిపి తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇష్టం వచ్చినట్టు పచ్చి అబద్దాలు ఆడేస్తోంది. సిట్ తమకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటూ ఎక్కడలేని అబద్ధాన్ని ఆడేస్తున్నారు వైసిపి నేతలు. వాళ్ల బరితెగింపు అబద్ధాలు చూసి ప్రజలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. అంటే వ్యవస్థలు, కోర్టులు చెప్పిన దాన్ని కూడా తప్పుగా వక్రీకరించడం అంటే రాజ్యాంగాన్ని ధీక్కరించడమే అంటున్నారు కూటమినేతలు. అందుకే ఈ అంశం మీద శాసనసభ వేదికగా ప్రజలకు నిజా నిజాలను వివరించాలని సీఎం చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారు.
అందులో భాగంగానే రేపటి నుంచి వచ్చే వారంలోపు ఏదో ఒక రోజు అసెంబ్లీలో కల్తీ నెయ్యి అంశం మీద చర్చించాలని చూస్తోంది ఏపీ ప్రభుత్వం. కల్తీ నెయ్యి అంశంలో ప్రజలకు వాస్తవాలను వివరించి అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలని చూస్తోంది. అయితే ఇన్ని రోజులు మైకుల ముందు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడిన వైసిపి.. ఇప్పుడు ఇదే అంశం మీద అసెంబ్లీకి వచ్చే చర్చించే ధైర్యం చేస్తుందా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. మైకుల ముందు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడినా సరే నడుస్తుంది కానీ అసెంబ్లీ వేదికగా ఏం మాట్లాడినా సరే అది రికార్డులో ఉంటుంది అనేది వైసిపి భయం. వైసీపీ నేతల ఇప్పటివరకు అసెంబ్లీకి రాకుండా చట్టసభలను అవమానిస్తూ మైకుల ముందు పచ్చి అబద్దాలను ఆడుతూ గడిపేస్తున్నారు.
మరి సిట్ నివేదికలు తమకు క్లినిక్ చిట్ వచ్చింది అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా.. మరి అదే విషయాన్ని అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ధైర్యం చేస్తారా లేదంటే తోక ముడుస్తారా అనేది కూటమినేతల మధ్య చర్చలకు దారితీస్తోంది. తప్పు చేయని వారు ఎక్కడికైనా వచ్చి నిజానిజాలను మాట్లాడే ధైర్యం చేస్తారు. కానీ వైసీపీ నేతలకు ఆ ధైర్యం లేదు అంటే మాత్రం తాను తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే అవుతుంది అంటున్నారు కూటమి నేతలు.