తప్పు చేసిన వారికి ఎప్పటికీ భయమే ఉంటుంది అనే విషయం వైసిపి విషయంలో ఎప్పటికప్పుడు నిరూపితం అవుతూనే ఉంది. పైకి ఎంత గంభీరంగా కనిపించినా.. ఎక్కడ తమ తప్పులు బయట పడతాయో అని వాళ్ళు ఎప్పటికప్పుడు టెన్షన్ పడుతూనే ఉన్నారు. అందుకే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సరే వెంటనే పెట్టేసి వద్దు అంటూ గగ్గోలు పెడుతున్నారు. నిజంగా తప్పు చేయని వారికి ఎన్ని విచారణ కమిటీలు వేసినా సరే అసలు భయం ఉండదు. ఎందుకంటే తప్పు చేసినప్పుడు సాక్షాలు దొరుకుతాయి అనే భయం ఉంటుంది. తప్పే చేయనప్పుడు సాక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తాయి. ఈ విషయం వైసిపికి తెలియనిది కాదు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం వేసిన ఏకసభ్య విచారణ కమిటీపై వైసీపీలో గుబులు మొదలైంది.
వైసిపి నేతలు కూడగట్టుకుని ఏక సభ్య కమిటీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సిబిఐ నియమించిన సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఏకసభ్య విచారణ కమిటీ ఎందుకు అంటున్నారు. కానీ ఇక్కడ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సిట్ నివేదికలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అని తెలిపింది. అంతేగాని నిందితుల లిస్ట్ ను యాడ్ చేయకపోవడంతో ఇన్ని రోజులు వైసిపి నేతలు తెగ మురిసిపోయారు. కానీ ప్రభుత్వం నిందితులను అస్సలు వదిలిపెట్టదు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఏక సభ్య విచారణ కమిటీ వేయడంతో ఎక్కడ తాను దొరికిపోతాము అంటూ వైసీపీ నేతలు టెన్షన్ మొదలైంది.
అందుకే ఏక సభ్య విచారణ కమిటీపై అంత భయం చూపిస్తున్నారు వైసిపి నేతలు. ఇదంతా జగన్ డైరెక్షన్ లోనే జరుగుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే జగన్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో నాలుగు డాక్యుమెంట్లు పట్టుకొచ్చి రకరకాల తప్పుడు ప్రచారాలు చేసేసి మళ్ళీ ప్యాలెస్ కు వెళ్ళిపోయారు. కానీ వైసీపీ నేతలు మాత్రం భయం ఇంకా కనిపిస్తోంది. వైసీపీ నేతల ఇప్పటివరకు అసెంబ్లీకి రాకుండా చట్టసభలను అవమానిస్తూ మైకుల ముందు పచ్చి అబద్దాలను ఆడుతూ గడిపేస్తున్నారు. మరి సిట్ నివేదికలు తమకు క్లినిక్ చిట్ వచ్చింది అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా.. మరి అదే విషయాన్ని అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ధైర్యం చేస్తారా లేదంటే తోక ముడుస్తారా అనేది కూటమినేతల మధ్య చర్చలకు దారితీస్తోంది. తప్పు చేయని వారు ఎక్కడికైనా వచ్చి నిజానిజాలను మాట్లాడే ధైర్యం చేస్తారు. కానీ వైసీపీ నేతలకు ఆ ధైర్యం లేదు అంటే మాత్రం తాను తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే అవుతుంది అంటున్నారు కూటమి నేతలు.