తాడిపత్రిలో మరోసారి జేసీ ఆధిపత్యం..ఆ ఎన్నికల్లో టీడీపీ హవా
Tadipatri: తాడిపత్రిలో మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి పైచేయి సాధించారు.;
తాడిపత్రిలో మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి పైచేయి సాధించారు. మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలో తెలుగు దేశం పార్టీ సభ్యులు గెలుపొందారు. టీడీపీకి చెందిన ముస్తాక్ అహ్మద్, షమీమ్, బింగి ప్రభాకర్ విజయం సాధించారు. అయితే టీడీపీ సభ్యులు ఎన్నిక కావడం ఓర్వలేని వైసీపీ సభ్యులు... కౌన్సిల్ హాల్‌ను బాయ్‌కట్ చేసి వెళ్లిపోయారు.
ఇక తాడిపత్రి అభివృద్ధి కోసం ఎంతవరకైనా పోరాడతామని... తనపై ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయనని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అభివృద్ధి అంటే ఏంటో తాడిపత్రిలో చేసి చూపిస్తామన్నారు. తాను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. తాడిపత్రి మున్సిపల్ పరిధిలోని విలువైన స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.