తమిళనాడులో కరోనా విజృంభణ.. కొత్తగా 6,227 కేసులు
తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రతిరోజు ఐదు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,227 మంది కరోనా బారినపడ్డారు.;
తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రతిరోజు ఐదు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,227 మంది కరోనా బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 4,97,066కు చేరింది. ఇప్పటివరకూ 4,41,649 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 47,110 మంది చికిత్స పొందుతున్నారు. ఒక్కరోజులోనే 76 మంది కరోనా కాటుకి బలవ్వగా.. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 8,307కు చేరింది.