TDP Anitha : నటనలో ఎస్‌వీ రంగారావు కూడా జగన్ దగ్గర దిగదుడుపే : టీడీపీ అనిత
TDP Anitha : ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం వెనుకు కుట్ర ఉందని ఆరోపించారు టీడీపీ మహళా అధ్యక్షులు వంగలపూడి అనిత;
TDP Anitha : ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం వెనుకు కుట్ర ఉందని ఆరోపించారు టీడీపీ మహళా అధ్యక్షులు వంగలపూడి అనిత. తాడేపల్లి ప్యాలస్, లోటస్ పాండ్‌కు వైఎస్ పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. నటనలో ఎస్‌వీ రంగారావు కూడా జగన్ దగ్గర దిగదుడుపేనంటూ మండిపడ్డారు. తండ్రిపై ప్రేమ ఉంటే తల్లిని, చెల్లిని పక్క రాష్ట్రాలకు ఎందుకు పంపారని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారతి, విజయసాయి రెడ్డి అల్లుడు ఉన్నారనే ప్రచారం జరుగుతోందన్నారు అనిత. ఇక అమరావతి రైతుల పాదయాత్ర చూసి వైసీపీకి భయం పట్టుకుందన్నారు.