TDP Bus Yatra: నేడు పాలకొల్లులో...
భారీగా పాల్గొన్న టీడీపీ నేతలు కార్యకర్తలు, ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు;
వైసీపీని ఓడిస్తేనే రాష్ట్ర ప్రజల భవిష్యత్‌కు భద్రత ఉంటుందని అన్నారు టీడీపీ నేతలు. భవిష్యత్‌కు భరోసా చైతన్య రథయాత్ర పాలకొల్లు నియోజక వర్గంలో నిర్వహించారు. రామానాయుడు అధ్యక్షతన ఎస్ కన్వెక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం పూర్తిచేయకుండా వదిలేసిన పనులను చూపిస్తూ సెల్ఫీ చాలెంజ్‌లు విసిరారు. మూడేళ్ల కిత్రం దగ్గులూరు వద్ద ఆర్భాటంగా బటన్ నొక్కి సీఎం జగన్ ప్రారంభించిన మెడికల్ కళాశాల పునాదులు కూడా పడకుండా ఉన్న పొలాలను పరిశీలించారు.
పేదల కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని పార్టీని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఎందరో మహానుభావులు పాలించిన ఆంధ్రప్రదేశ్ నేడు ఒక దౌర్భాగ్యపు వ్యక్తి పాలనలో అల్లాడు తోందని విమర్శించారుమాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఒక్కచాన్స్ అని అధికారం లోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని దోచేస్తున్నాడని మండి పడ్డారు. మద్య నిషేధం అమలు చేస్తానని చెప్పి రానున్న 25 ఏళ్ల పాటు మద్యం మీద ఆదాయం చూపి అప్పులు తెచ్చిన దుర్మార్గుడు అని అన్నారు.
ఇక జగన్ పాలనలో బీసీలపై దాడులు, వేధింపులు, అక్రమ కేసులు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. జగన్ దగ్గర బీసీ మంత్రులకు ఏ విధమైన అధికారాలు లేవన్నారు. ప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో టీడీపీ గెలుపు ఖాయమన్నారు టీడీపీ నేతలు
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప,పితాని సత్యనారాయణ,కొత్తపల్లి జవహర్, గొల్లపల్లి సూర్యారావు,ఎమ్మెల్సీలు పంచుమర్తి అనూరాధ, దువ్వాడ రామారావు, వేంపాడ చిరంజీవి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్, మాజీ ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, శివరామరాజు, పాల్గొన్నారు.