శిరీష బండ్లకు అభినందనలు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు
అందులో శిరీష బండ్ల ఒకరు.అంతరరిక్షయానం చేయనున్న శిరీష బండ్లకు... అభినందనలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు.;
అంతరిక్షంలోకి తొలిసారి తెలుగు మూలాలున్న మహిళ అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 11న.... అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ... అంతరిక్ష వాహక నౌకను ప్రయోగించనుంది. తొలిసారిగా నలుగురు ప్రయాణికులతో వెళ్లనున్న ఈ వాహకనౌకలో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల కూడా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. వర్జిన్ గెలాక్టిక్ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలి హోదా ఉన్న శిరీష బండ్ల... అంతరిక్షయానం చేయనున్నారు. న్యూ మెక్సికో నుంచి ఈ స్పేస్ ప్లైట్ బయల్దేరనుంది. ఇందులో ఇద్దరు పైలట్లతో పాటు వర్జిన్ గెలాక్టిక్ అధిపతి రిచర్డ్ బ్రాన్స్, మరో ముగ్గురు కంపెనీలు ప్రతినిధులకు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం లభించింది. అందులో శిరీష బండ్ల ఒకరు.అంతరరిక్షయానం చేయనున్న శిరీష బండ్లకు... అభినందనలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. భారతీయులు గర్వించేస్థాయిలో.... అంతరిక్షంలోకి వెళ్తున్న శిరీష బండ్ల... శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.