CBN: ఓటమి భయంతో వైసీపీ నేతలకు నిద్ర కరవు

చంద్రబాబు ఆగ్రహం...క్రోసూరులో టీడీపీ ఆఫీస్‌కు నిప్పు పెట్టడంపై మండిపాటు

Update: 2024-04-09 02:15 GMT

ఓటమి భయంతో వైసీపీ రౌడీ మూకలకు నిద్రపట్టడం లేదని.... తెలుగుదేశం అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. అందుకే..పల్నాడు జిల్లా క్రోసూరులో అర్ధరాత్రి తెలుగుదేశం కార్యాలయానికి నిప్పు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రోసూరు ప్రజాగళం సభకు వచ్చిన జన స్పందన చూసి ఓర్వలేకనే వైసీపీ మూకలు ఇలాంటి దారుణానికి పాల్పడ్డారని... మండిపడ్డారు. రౌడీయిజం, విధ్వంసంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే వైసీపీ నైజమని విమర్శించారు. ప్రజలంతా ఏకమై వైసీపీ మూకలను తరిమికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అటు క్రోసూరులో వైకాపా మూకలు ధ్వంసంచేసిన కార్యాలయాన్ని పరిశీలించిన పెదకూరపాడు MLA అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలసి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం కార్యాలయానికి నిప్పుపెట్టిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులకు విజ్ఞప్తిచేశారు.


మరోవైపు CM జగన్ ఆత్మబంధువు, వైసీపీ పా MLC అనంతబాబు చేష్టలు చూస్తుంటే.... కుక్కతోక వంకర అనే సామెత గుర్తొస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను... హతమార్చి డోర్ డెలివరీ చేసిన ఘటనపై రాజమండ్రి సెంట్రల్ జైలులో చిప్పకూడు తిన్నా అనంతబాబుకు బుద్దిరాలేదని లోకేశ్ ఆక్షేపించారు. ఇప్పుడు పోలవరం నిర్వాసితుల పరిహారంపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించినందుకు కూనవరం మండలం కూటూరులో ఆదివాసీలపై.. తన గన్ మ్యాన్ తో అనంతబాబు దాడిచేయించారని లోకేశ్ ఆరోపించారు. ఈ చర్యతో.. అనంత బాబు తన రాక్షస ప్రవృత్తిని. మరోసారి చాటుకున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ సోదరులపై దమనకాండ సాగిస్తున్న అనంతబాబు అతడిని పెంచి పోషిస్తున్న తాడేపల్లి ప్యాలెస్ ను బద్ధలుగొట్టడానికి 5కోట్లమంది ప్రజలు సిద్ధమయ్యారనే విషయాన్ని..... జగన్ గుర్తించాలని లోకేశ్ హెచ్చరించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం విపక్ష NDA కూటమి మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టిసారించింది. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా....... ప్రజా మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు తెలిపారు. NDA కూటమి త్వరలో విడుదల చేయనున్న ప్రజా మేనిఫెస్టో కోసం ప్రజల అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం వాట్సాప్ నెంబర్-8341130393ను.. నేతలు విడుదల చేశారు.

Tags:    

Similar News