Sand mafia: అమరావతి ఇసుక మాఫియాను అడ్డుకున్న జనసేన, టీడీపీ

Update: 2023-11-13 08:15 GMT

పల్నాడు జిల్లా అమరావతిలో అధికార పార్టీ నాయకుల అక్రమ ఇసుక రవాణాను తెదేపా, జనసేన నాయకులు అడ్డుకున్నారు. కృష్ణా నదిలో ఇసుకను తవ్వి అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, పొక్లైనుకు అడ్డంగా కూర్చుని నిరసన తెలియజేశారు. అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా సహజ సంపదను దోచుకుంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. అక్రమంగా తరలిస్తున్న లారీలను అడ్డుకోవడంతో వైకాపా నాయకులకు.. తెదేపా, జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇసుక రీచ్ ల నుంచి బలవంతంగా పంపించాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్నారంటూ తెదేపా, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీలో కీలక వాటాదారుడు గనులశాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డేనని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. గత ప్రభుత్వంలోని మంత్రివర్గ నిర్ణయాలు తప్పు అని తేల్చే అధికారం ఆయనకు ఎక్కడి నుంచి వచ్చందని మండిపడ్డారు. నకిలీ వే బిల్లులతో రాష్ట్ర సంపద కొల్లగొడుతున్నారన్నారు. కోల్ కతా నుంచి రహస్యంగా నడిపిన ఇసుక టెండర్ల విధానం మరో పెద్ద కుంభకోణమన్న ఆనంద్ బాబు...భవిష్యత్ లో అందిరూ శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.

Tags:    

Similar News