విజయసాయిరెడ్డి సూచనలతోనే పోలీసులు అరెస్టులకు పాల్పడ్డారు : కళా వెంకట్రావు
బెయిల్‌పై విడుదలైన కళావెంకట్రావు.. జగన్ పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందని విమర్శించారు;
బెయిల్‌పై విడుదలైన కళావెంకట్రావు.. జగన్ పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందని విమర్శించారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్‌లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దేవుడికి న్యాయం చేయడం కోసం ప్రాణాలైనా అర్పిస్తామని స్పష్టంచేశారు. చట్టాల్ని చేతుల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రామతీర్థంలో విజయసాయిరెడ్డి సూచనలతోనే పోలీసులు అరెస్టులకు పాల్పడ్డారని కళావెంకట్రావు విమర్శించారు.