Nara Lokesh : వైసీపీ సర్కార్‌పై నిప్పులు చెరిగిన నారా లోకేష్
Nara Lokesh : వైసీపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పెట్రోల్, డీజిల్‌పై బాదుడు ఆపేది ఎప్పుడంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.;
Nara Lokesh : వైసీపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పెట్రోల్, డీజిల్‌పై బాదుడు ఆపేది ఎప్పుడంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించి అన్ని రాష్ట్రాల సీఎంలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. హర్యానా, యూపీ ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌పై 12 రూపాయలు తగ్గించాయని చెప్పారు. అస్సోం, గోవా, త్రిపుర, మణిపూర్, కర్ణాటక పెట్రోల్, డీజిల్‌పై 7 తగ్గించాయని గుర్తు చేశారు. ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్‌పై 6 రూపాయాలు, డీజిల్‌పై రూ.11 రూపాయలు తగ్గించిందని.... కానీ వసూల్‌రెడ్డికి మాత్రం పన్నుల భారం తగ్గించడానికి మనసు రావడంలేదని ఎద్దేవా చేశారు. పన్నుల బాదుడుతో జనజీవితాలు అగమ్యగోచరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశమంతా పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గిస్తున్న నేపథ్యంలో ప్రజలపై వసూల్‌రెడ్డి కరుణ చూపాలన్నారు నారా లోకేష్.