వైసీపీ ప్రభుత్వంపై వర్ల రామయ్య ఫైర్
జగన్ కేసులో ముద్దాయిగా ఉన్నశ్యామ్యుల్‌ను రాష్ట్ర ఎన్నికల నూతన కమిషనర్‌గా పేరును ప్రతిపాదించడం ఏంటని ప్రశ్నించారు.;
వైసీపీ ప్రభుత్వంపై టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ కేసులో ముద్దాయిగా ఉన్నశ్యామ్యుల్‌ను రాష్ట్ర ఎన్నికల నూతన కమిషనర్‌గా పేరును ప్రతిపాదించడం ఏంటని ప్రశ్నించారు. నిమ్మగడ్డ స్థానంలో దళిత వర్గానికి చెందిన కనగరాజ్‌ను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. సీఎం జగన్ ముద్దాయిలకు అండగా ఉన్నారని ఆరోపించారన్న వర్ల రామయ్య.. గవర్నర్ శ్యామ్యుల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈనెల 31న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పదవికాలం పూర్తి కానుంది. దీంతో నూతన ఎన్నికల కమిషనర్‌ను నియమించడం కోసం జగన్ ప్రభుత్వం ముగ్గురి పేర్లతో కూడిన నివేదికను గవర్నర్‌కు పంపింది.