Yadlapati Venkatarao : టీడీపీ సీనియర్‌ నేత యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత

Yadlapati Venkatarao : టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకట్రావు (102) కన్నుమూశారు.

Update: 2022-02-28 02:30 GMT

Yadlapati Venkatarao : రాజ్యసభ మాజీ సభ్యులు, టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు కన్నుముశారు. కొన్ని రోజులుగా అనార్యోగంతో బాధపడుతున్న ఆయన… ఈ తెల్లవారుజామున హైదరాబాద్‎లోని తన కూతురు నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెనాలి సమీపంలోని బోడపాడులో 1919లో యడప్లాటి జన్మించారు. 1967,1978లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన.. 1978-80 మధ్య వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం 1983లో టీడీపీలో చేరారు. 1995లో గుంటూరు జడ్పీ ఛైర్మన్‎గా, 1998లో రాజ్యసభ్యుడిగా యడ్లపాటి వెంకట్రావు ఎన్నియ్యారు. రైతు నాయకుడిగా ఆయన విశేష సేవలందించారు. సంగం డైయిరీకి వెంకట్రావు వ్యవసాయ అధ్యక్షుడుగా ఉన్నారు.

యడ్లపాటి వెంకట్రావు మృతి కి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన యడ్లపాటి రాజకీయ జీవితం ఎంతో ఆదర్శ ప్రాయంగా సాగిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర మంత్రిగా, జడ్పి చైర్మన్ గా, రాజ్యసభ సభ్యునిగా పని చేసిన యడ్లపాటి...తాను చేపట్టిన పదవులకు వన్నెతెచ్చారని అన్నారు. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిగా యడ్లపాటి ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. యడ్లపాటి కుంటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలియజేశారు. వెంకట్రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

మాజీమంత్రి యడ్లపాటి వెంకట్రావు మృతి బాధాకరమని... ప్రజాప్రతినిధిగా ప్రజలకు నాయకుడిగా పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. మంత్రిగా పార్లమెంట్ సభ్యునిగా రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారు. సంఘం డైరీ , జంపని షుగర్ మిల్లుల ఏర్పాటులో వెంకట్రావు కృషి మరువలేనిదన్నారు.

Tags:    

Similar News