ఉద్యోగులను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై గవర్నర్‌కు ఫిర్యాదు
పెద్దిరెడ్డిని వెంటనే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసేలా సీఎంను ఆదేశించాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.;
ఉద్యోగులను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనుంది టీడీపీ బృందం. మంత్రి పెద్దిరెడ్డి ఉద్యోగులను బెదిరిస్తున్నారని ఆరోపించారు తెలుగుదేశం నేతలు. ఇదే విషయమై టీడీపీ నేతలు గవర్నర్‌ను కలవనున్నారు. పెద్దిరెడ్డిని వెంటనే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసేలా సీఎంను ఆదేశించాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.