Nandamuri Balakrishna: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత
Nandamuri Balakrishna: నగర అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే చేతగానీవాళ్లలాగా వైసీపీ నేతలు ఇంటిని ముట్టడించడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం;
Nandamuri Balakrishna:హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాలకృష్ణ ఇంటిని వైసీపీ కార్యకర్తలు ముట్టడించడం ఉద్రిక్తతకు దారితీసింది. పోటీగా టీడీపీ శ్రేణులు కూడా భారీగా బాలకృష్ణ ఇంటికి చేరుకున్నారు. ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు మోహరించారు. 21వ వార్డులో డంపింగ్ యార్డ్ గురించి టీడీపీ నేత సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ఆగ్రహించిన అధికార పార్టీ నేతలు బాలకృష్ణ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. నగర అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే చేతగానీవాళ్లలాగా వైసీపీ నేతలు ఇంటిని ముట్టడించడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.