Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేతపై నిరసనలు.. చలో నర్సీపట్నం పిలుపుతో..

Ayyanna Patrudu: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేతపై నిరసనలు వెల్లువెత్తాయి.

Update: 2022-06-20 16:00 GMT

Ayyanna Patrudu: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేతపై నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం కూల్చివేతలను నిరసిస్తూ టీడీపీ చేపట్టిన చలో నర్సీపట్నం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు. టీడీపీ నేతలను అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

నేతలెవరూ నర్సీపట్నం రాకుండా ముందస్తుగా హౌస్ అరెస్టులు చేశారు. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి బండారుతో పాటు పలువురు నేతలను పోలీసులు బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు. పోలీసులు నిర్బంధాలు ఉన్నా లెక్క చేయకుండా చింతకాలయ విజయ్ దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు టీడీపీ శ్రేణులు వందలాదిగా తరలివచ్చారు.

అయ్యన్న ఇంటి వద్ద గోడ కూల్చిన ప్రదేశాన్ని సీపీఐతో పాటు పలువురు టీడీపీ నాయకులు పరిశీలించారు. జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాత్రిపూట కూల్చివేతలపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై జగన్‌రెడ్డి ఏం సమాధానమిస్తారని ప్రశ్నించారు. తప్పుచేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.

అటు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుటుంబానికి మహిళలు పెద్ద ఎత్తున తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వానివి కక్ష సాధింపులని ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుడు ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అని ఆయన సతీమణి పద్మావతి అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తెలిపారు. విశాఖ నుంచి టీడీపీ కార్యకర్తలు, అభిమానులను నర్సీపట్నం రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. 

Tags:    

Similar News