టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్, పోలీసుల మధ్య ఘర్షణ ..!
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా.. విజయనగరంలో టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్, పోలీసుల మధ్య ఘర్షణ నెలకొంది.;
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా.. విజయనగరంలో టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్, పోలీసుల మధ్య ఘర్షణ నెలకొంది. జగదీశ్‌ను కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.. వైసీపీ ఎమ్మెల్యే జోగారావును కౌంటింగ్ కేంద్రంలోకి పోలీసులు అనుమతించారు. అధికార పార్టీ నేతల్ని లోపలికి ఎలా పంపిస్తారని ప్రశ్నించిన ద్వారపురెడ్డి జగదీశ్.. పోలీసుల వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.