వైసీపీకి 22 మంది ఎంపీలున్నా.. రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేకపోయారు: ఎంపీ గల్లా
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. వైసీపీ నుంచి 22 మంది ఎంపీలున్నా.. రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేకపోయారని విమర్శించారు.;
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. వైసీపీ నుంచి 22 మంది ఎంపీలున్నా.. రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేకపోయారని విమర్శించారు. బడ్జెట్‌లో రాష్ట్రం గురించి ఒక్క ప్రతిపాదన కూడా లేదని.. విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు అంశాల ప్రస్తావనే రాలేదన్నరు ఎంపీ గల్లా జయదేవ్. కాగా బడ్జెట్‌లో ఏపీకి ఒక్క రూపాయి కూడా రాలేదన్నరు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్. రాష్ట్రంలో విధ్వంస పాలన కొనసాగుతోందని.. వైసీపీ ప్రభుత్వం తీరుతోనే దుర్గతి పట్టిందన్నారు. కేపిటల్ పై క్లారిటీ లేదని.. ఏ కేపిటల్‌కు నిధులిస్తారని ఎంపీ కనకమేడల ప్రశ్నించారు.