129వ రోజుకు చేరిన యువగళం పాదయాత్ర
లోకేష్ యువగళం పాదయాత్ర ఇవాళ్టితో 129వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు 1638 కి.మీ దూరం నడిచారు.;
లోకేష్ యువగళం పాదయాత్ర ఇవాళ్టితో 129వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు 1638 కి.మీ దూరం నడిచారు. ఆత్మకూరు ముగించుకుని వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అడుగపెట్టిన లోకేష్ ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆయన కుల్లూరు క్యాంప్ సైట్‌లో ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కుల్లూరు క్యాంప్ సైట్‌లో యానాది సామాజిక వర్గీయులతో ముఖాముఖి సమావేశం అనంతరం... పాదయాత్ర ప్రారంభించనున్నారు. కుల్లూరులో స్థానికులతో భేటీ అవుతారు. అనంతరం మాదన్నగారిపల్లిలోనూ, వెంకట్రామరాజుపేటలో స్థానికులతో సమావేశవుతారు. చింతలపాలెం ఎస్సీ కాలనీలో దళితులతో భేటీ అవుతారు. అనంతరం ఉయ్యాలపల్లిలో స్థానికులతో సమావేశవుతారు. కొత్తూరుపల్లి క్రాస్ వద్ద ఎస్సీ సామాజిక వర్గీయులతో భేటీ అవుతారు. అనంతరం తేగచర్లలో స్థానికులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంటారు. రాత్రి తెగచర్ల శివారు విడిది కేంద్రంలో లోకేష్ బస చేస్తారు.