Lokesh : వైసీపీ పాలనలో నెల్లూరు నేరాలకు అడ్డాగా మారింది : లోకేష్ ట్వీట్

Nellore : డబుల్‌ మర్డర్‌తో నెల్లూరు నగరం ఉలిక్కిపడింది. కృష్ణారావు, సునీత దంపతుల దారుణహత్య విచారకరమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు;

Update: 2022-08-29 09:45 GMT

Lokesh : డబుల్‌ మర్డర్‌తో నెల్లూరు నగరం ఉలిక్కిపడింది. కృష్ణారావు, సునీత దంపతుల దారుణహత్య విచారకరమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. హత్యలు జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. సునీత టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్త అని తెలిపారు. అధికారులు ఈ కోణంలో కూడా విచారించి.. హత్యలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు.

వైసీపీ పాలనలో నెల్లూరు నేరాలకు అడ్డాగా మారిందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ట్వీట్‌ చేశారు. రోజుకో ఘటనతో స్థానికులు ఆందోళనలో ఉన్నారన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన కొంతమంది పోలీసులు.. వైసీపీ రాజకీయ వికృత క్రీడలో భాగస్వామ్యం అవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు.

శనివారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన నిన్న ఉదయం వెలుగులోకి వచ్చింది. డబ్బు కోసం దొంగలు ఈ ఘాతుకానికి ఒడిగట్టారా? లేక కక్షల నేపథ్యంలో మరెవరైనా హత్య చేశారా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలనుంది. అయితే.. వీరికి ఎవరితోనూ విభేదాలు లేవంటున్నారు స్థానికులు.

Tags:    

Similar News