TDP: టీడీపీ సోషల్ మీడియా నిర్వాహకుడు అరెస్ట్..
TDP: టీడీపీ సోషల్ మీడియా నిర్వాహకుడు వెంగళరావును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.;
TDP: టీడీపీ సోషల్ మీడియా నిర్వాహకుడు వెంగళరావును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వెంగళరావు ఇంకా సీఐడీ అదుపులోనే ఉన్నారు. అయితే ఆయన అరికాళ్లకు గాయాలు అయ్యాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. సీఐడీ పోలీసులు.. వెంగళరావును కొట్టారని టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. వెంటనే సీఐడీ ఆఫీసుకు వెళ్లాలని నేతలని ఆదేశించారు. సీఐడీ పోలీసులు ప్రశ్నించాలి కానీ... కొట్టమేంటని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంగళరావు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు.