YS Viveka murder Case: గంగిరెడ్డి బెయిల్‌ విచారణ వాయిదా

జస్టిస్ PS నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది

Update: 2023-05-24 10:30 GMT

గంగిరెడ్డి బెయిల్‌పై విచారణను వాయిదా వేసింది. జస్టిస్ PS నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. జులై 1న గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని ట్రయిల్ కోర్ట్ ని ఆదేశిస్తూ గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. జూన్ 30 వరకే వివేకా హత్యకేసు దర్యాప్తును ముగించాలని సుప్రీం కోర్టు సీబీఐకి డెడ్‌లైన్‌ పెట్టిన నేపధ్యంలో జులై 1న గంగిరెడ్డి కి బెయిల్ ఇవ్వాలని ట్రయిల్ కోర్ట్ కి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

దీనిపై సుప్రీంకోర్టులో సవాలు చేశారు వివేకా కుమార్తె సునీత రెడ్డి. ఈ నేపధ్యంలో బెయిల్ రద్దుకు సంబందించి హై కోర్ట్ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశాడు గంగిరెడ్డి. తమ పిటిషన్‌తో కలిపి సునీత పిటిషన్ ను విచారించాలని గంగిరెడ్డి తరపు లాయర్ కోరారు. అయితే జులై 1న గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ఎనిమిదో వింతలా ఉందని సీబీఐ తరపున లాయర్‌ సంజయ్ జైన్ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. గంగిరెడ్డి పిటిషన్ పై కౌంటర్ దాఖలుకు సమయం కోరింది సీబీఐ.

Tags:    

Similar News