అడ్డంగా దొరికిపోయిన శ్యామల.. ఇన్ని అబద్దాలా..?

Update: 2025-10-29 08:00 GMT

ఏపీలో వరుస విపత్తులు ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ఓ వైపు మొంథా తుఫాన్ ఏపీని అతలాకుతలం చేస్తోంది. కూటమి ప్రభుత్వం అత్యంత బాధ్యతతో ముందస్తు చర్యలు తీసుకుంది. అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుని ఇప్పటికే ప్రత్యేక నిధులు కూడా కేటాయించింది. కానీ వైసీపీకి మాత్రం ఏ మాత్రం బాధ్యత లేదు. ప్రతిపక్ష పార్టీ ఎంత బాధ్యతతో వ్యవహరించాలి. ఇలాంటి టైమ్ లో పిచ్చి రాజకీయాలు చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలి. కానీ ఇవేవీ వైసీపీకి పట్టవు. ఎంతసేపు శవ రాజకీయాలు చేస్తూనే ఉంటుంది. మొన్న కర్నూలు ఘటనలో 19 మంది చనిపోతే వైసీపీకి ఏ మాత్రం బాధ లేదు. దీనిపై కూడా వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పుకుని తిరిగే శ్యామల ప్రెస్ మీట్ అర్థం లేని మాటలు మాట్లాడుతోంది.

కర్నూలు బస్సు ప్రమాదానికి బెల్టు షాపులే కారణం అంట. దాని వల్లే 19 మంది ప్రాణాలు కోల్పోయారంట. పాపం వెనకా ముందు తెలుసుకోకుండా ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివేసింది. చనిపోయిన ఆ 19 మంది కుటుంబాలను శ్యామల పరామర్శించారా.. వారికి ఏమైనా వైసీపీ నష్టపరిహారం ప్రకటించిందా.. ఇవేవీ లేవు. పైగా సోషల్ మీడియాలో పది ప్రశ్నలు అంటూ ఏదో పోస్టు చేసేసింది. శివశంకర్, ఎర్రిస్వామి కలిసి కూటమి ప్రభుత్వం బెల్టుషాపులో అమ్మిన కల్తీమద్యం తాగడం వల్లే ప్రమాదం జరిగిందంట. ఇప్పటికే పోలీసులు సీసీ ఫుటేజీతో సహా వాళ్లు మద్యం కొన్నది లైసెన్స్ డ్ వైన్స్ షాపులో అని చూపించారు. కానీ అది వాళ్లకు కనిపించట్లేదు కాబోలు.

బస్సు ప్రమాదానికి బెల్టుషాపులో మద్యం కారణం కాదు. వాళ్లు వైన్ షాపులో కొని తాగారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, ట్రావెల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఇందులో ఉన్నాయి. కానీ ఇవేవీ లేకుండా.. కూటమి ప్రభుత్వంపై బురద జల్లేయడానికి శ్యామల రెడీ అయిపోయారు. ఆమె చెప్పినట్టు ఏపీలో విచ్చలవిడిగా మద్యం అమ్మట్లేదు. రాత్రి 11 తర్వాత ఎక్కడా షాపులు ఉండవు. కావాలంటే వైసీపీ మీడియా ఆధారాలు బయటపెట్టొచ్చు కదా. శివశంకర్ మద్యం కొన్న రేణుక ఎల్లమ్మ వైన్స్ షాపు హైవే పక్కన ఉందని శ్యామల చెప్పింది అది నిజం కాదు. వైన్ షాపు హైవేకు 250 మీటర్ల అవతల ఉంది. శివశంకర్ మద్యం తాగింది సాయంత్రం అయితే తెల్లవారు జామున ప్రమాదం ఎలా జరిగిందని ఆమె పిచ్చి ప్రశ్న వేసింది. వాళ్లు రాత్రంతా తాగుతూనే తిరిగారు. అది ఆమెకు తెలియదు. లక్ష్మీపురంలో బెల్టుషాపు నడుపుతున్న వ్యక్తి సీసీ ఫుటేజీ బయట పెట్టాడని చెప్పారు శ్యామల. మరి దాన్ని ఎందుకు చూపించట్లేదు. ఇలా అన్నీ అబద్దాలు చెప్పి శ్యామల ఏపీ ప్రజల ముందు పరువు తీసుకున్నారు.

Tags:    

Similar News