Pawan Kalyan : రాజ్యాంగ తప్పిదానికి పరిష్కారం చూపిన రోజు.. పవన్ కీలక కామెంట్స్
ఆగస్టు 5, 2019 భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోయిన రోజు. ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం..దేశ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. గత ప్రభుత్వాలు ఎవ్వరూ చెయ్యని సాహసాన్ని చేసి చూపింది మోదీ ప్రభుత్వం. భారత్‌లో కీలకమైన జమ్మూ కశ్మీర్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదాను ఉపసంహరించుకుంటూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో సరిగ్గా ఆరేళ్ల క్రితం అఖండ భారతంలో విలీనం అయింది జమ్మూకశ్మీర్.
జమ్మూకశ్మీర్ భారత్‌లో విలీనం అయ్యి ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక చారిత్రాత్మక రాజ్యాంగ తప్పిదానికి పరిష్కారం చూపిన రోజు ఇది అని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా అశాంతి, హింసతో ప్రభావితమైన ఆ ప్రాంతాలకు స్వేచ్ఛ, స్వతంత్రం వచ్చిందన్నారు. దశాబ్దాలుగా ఉగ్రవాదం, హింస అక్కడి యువత ఆకాంక్షలను అణచి వేసిందని. ఆర్టికల్ 370 రద్దు భవిష్యత్తు పై ఆశ, స్థిరత్వం, వాగ్దానాన్ని తెచ్చిపెట్టింది అని ఆయన తన సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడ్డారు.