శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మండలం పై పల్లిలో కొండచిలువ సోమవారం అర్ధరాత్రి సమయంలో హల్చల్ చేసింది. గొర్రెల మందలోకి చేరిన భారీ సర్పం ఒక గొర్రెల చంపి అమాంతం మింగేసింది. మరో గొర్రెను చంపే ప్రయత్నం చేస్తుండగా గుర్తించిన గొర్రెల యజమాని విజయ్ అటవీ అధికారులకు సమాచారం అందించారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు భారీ కొండచిలువను వైల్డ్ కేర్ కరుణా సొసైటీ సిబ్బంది సహాయంతో చాకచక్యంగా బంధించి అభయారణ్యంలో వదిలిపెట్టారు. భారీ సర్పాన్ని బంధించడంతో గొర్రెల కాపరులు గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పైపల్లి సమీపంలో అటవీ ప్రాంతం ఉండడంతో మేత కోసం భారీ సర్పం ఇక్కడికి వచ్చి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.