THEFT: అమ్మవారి ఆగ్రహానికి గజగజలాడిన దొంగలు

Update: 2025-09-06 03:30 GMT

అనం­త­పు­రం­జి­ల్లా­లో అత్యంత అరు­దైన ఘటన జరి­గిం­ది. ఓ ఆల­యం­లో హుం­డీ ఎత్తు­కె­ళ్లిన దొం­గ­లు దా­న్ని తి­రి­గి తీ­సు­కు­వ­చ్చా­రు. డబ్బు­ల­తో సహా ఆల­యం­లో వది­లే­సి వె­ళ్లా­రు. బు­క్క­రా­య­స­ము­ద్రం­లో­ని ము­స­ల­మ్మ దే­వా­ల­యం­లో ఈ సం­ఘ­టన చో­టు­చే­సు­కుం­ది. జులై నెల చి­వ­ర్లో ము­స­ల­మ్మ దే­వా­ల­యం­లో దొం­గ­లు పడ్డా­రు. డబ్బు­లు ఉన్న హుం­డీ­ని ఎత్తు­కె­ళ్లా­రు. ఆ సమ­యం­లో హుం­డీ­లో సు­మా­రు రూ.2లక్షల వరకూ ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది.చోరీ చే­సిన నగ­దు­తో పాటు ఓ లే­ఖ­ను దొం­గ­లు ఆలయం వద్ద ఉంచి వె­ళ్లా­రు. హుం­డీ­లో నగదు దొం­గి­లిం­చ­డం­తో తమ పి­ల్ల­లు అనా­రో­గ్యం బా­రిన పడ్డా­ర­ని లే­ఖ­లో పే­ర్కొ­న్నా­రు. దొం­గ­లు తి­రి­గి తె­చ్చిన నగ­దు­ను ఆలయ ని­ర్వా­హ­కు­లు లె­క్కిం­చా­రు. మొ­త్తం నగదు రూ.1,86,486 ఉన్న­ట్లు వారు తె­లి­పా­రు. అమ్మ­వా­రి మహ­త్యం వల్లే దో­చు­కె­ళ్లిన నగ­దు­ను దొం­గ­లు తి­రి­గి తె­చ్చి­పె­ట్టా­ర­ని ఆలయ ని­ర్వా­హ­కు­లు చె­ప్పా­రు.

Tags:    

Similar News