కాకినాడ జిల్లా దారుణం జరిగింది. ఆలయంలోని అమ్మవారి మెడలో తాళిని తెంచుకుని వెళ్ళిపోయాడు. ఈ ఘటన తొండంగి మండలం పి.అగ్రహారం వలసపాకల లో జరిగింది. అక్కడి దుర్గమ్మ గుడి తాళం పగలకొట్టి లోపలికి చొరబడ్డ దొంగ అమ్మవారి మెడలో ఉన్న మూడు జతల బంగారు సూత్రాలు, వెండి కిరీటం ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు గుడి సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆలయాన్ని పరిశీలించిన పోలీసులు.. దొంగ కోసం గాలిస్తున్నారు. సీసీ టీవీ పుటేజ్‌లో దొంగతనం దృశ్యాలు క్లియర్‌గా కనిపిస్తుండటంతో దొంగను గుర్తించడం పెద్ద కష్టంకాదని అంటున్నారు. .