అమరావతిలో చేతివాటం ప్రదర్శిస్తున్న దొంగలు
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు తెరపైకి తేవడంతో అమరావతిలో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇదే అదనుగా భావించిన కొందరు దొంగతానికి పాల్పడుతున్నారు.;
ఒకవైపు రాజధాని కోసం అమరావతితో రైతులు ఉద్యమిస్తుంటే మరోవైపు దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అమరావతి రాజధానిగా గత ప్రభుత్వం పెద్దయెత్తున భవనాలను నిర్మించి అభివృద్దిపరిచింది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు తెరపైకి తేవడంతో అమరావతిలో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇదే అదనుగా భావించిన కొందరు దొంగతానికి పాల్పడుతున్నారు. ఓ రైతు పొలంలో కరెంట్ పోల్‌కోసం సిద్దం చేసిన ఐరన్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇప్పటివరకు ఇసుక మాత్రమే చోరీచేసిన దొంగలు.. ఇప్పుడు ఏకంగా ఐరన్ పిల్లర్లను కట్ చేసి తీసుకెళ్లారు. నిత్యం ఇక్కడ చోరీలు జరుగుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రాజధాని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.