భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తిరుమలలో జనసేన కార్యకర్త త్రిలోక్ కుమార్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు ఓ వ్యక్తి ఫోన్ చేసి హిందీలో మాట్లాడుతూ.. 'తాను పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తినని, మీ కుటుంబాన్ని బాంబులేసి లేపేస్తా. మీరు ఎక్కడుంటారో, ఏం చేస్తారో అంతా మాకు తెలుసు. జాగ్రత్తగా ఉండండి' అని వార్నింగ్ ఇచ్చినట్టు పేర్కొన్నాడు.