నిన్న కర్నూలులో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభ నిజంగానే సూపర్ సక్సెస్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీకి వచ్చినప్పుడల్లా చాలా మేలు జరుగుతుంది. గత ఐదేళ్లలో ఎన్నడూ చూడని విధంగా కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. నిన్నటి సభలో 13,450 కోట్ల దాకా అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇది నిజంగా ఏపీకి మంచి బూస్ట్ లాగా పని చేస్తుంది. ఈ సభ ద్వారా ఒక సంకేతాన్ని అయితే ప్రజలకు ఇచ్చారు. ఏపీలోని మూడు ప్రాంతాలను ఒకే స్థాయిలో అభివృద్ధి చేయడం.. కూటమిలోని మూడు పార్టీలు సమిష్టిగా కలిసి ముందుకు వెళ్లడం అనే ఇంటిమేషన్ ఇచ్చారు. ఏపీలోని అటు విశాఖ, మధ్యలో అమరావతి, ఇటు రాయలసీమ ఒకే స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయి. ఏ ఒక్క ప్రాంతాన్ని తక్కువ చేయడం కానీ.. ఒక ప్రాంతానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ కూటమి ప్రభుత్వం చేయట్లేదు.
జగన్ లాగా మూడు రాజధానులు అంటూ మాటలకే పరిమితం కావట్లేదు. మాటలతో మాయ చేయకుండా.. ప్రపంచ మేటి కంపెనీలను ఈ మూడు ప్రాంతాలకు తీసుకువచ్చి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తుంది కూటమి ప్రభుత్వం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడం, ఇటు కర్నూలులో డ్రోన్ డేటా సెంటర్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకువస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ విషయాలను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దేశంలోనే ఏపీ అత్యంత వేగంగా డెవలప్మెంట్ అవుతుందని నిన్నటి సభలో ప్రకటించారు. దానికి కేంద్రం సహకారం కూడా పూర్తిగా ఉందన్నారు. గత ఐదేళ్లలో ఏపీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని.. ఇప్పుడున్న సమర్థవంతమైన నాయకత్వంలో స్పీడుగా ఇంటర్నేషనల్ కంపెనీలు తీసుకువస్తున్నారని ప్రశంసించారు.
కూటమిలోని మూడు పార్టీలు కలిసి ఏపీలోని మూడు ప్రాంతాలను సూపర్ విజన్ తో అభివృద్ధి చేస్తాయని తెలిపారు. రాజధాని అమరావతి అయినంత మాత్రాన మిగతా ప్రాంతాలను వదిలేసే ప్రసక్తే లేదని.. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి ఉండేలా చూస్తామని ఈ సభ నుంచే హింట్ ఇచ్చారు. మిగతా రాష్ట్రాల్లో కేవలం రాజధానులను మాత్రమే డెవలప్ చేసి మిగతా ప్రాంతాలను వదిలేశారు. కానీ ఏపీలో మాత్రం రాజధానితో పాటే మిగతా ప్రాంతాలకు కంపెనీలను తీసుకొచ్చి అక్కడ కూడా డెవలప్ మెంట్ ఉండేలా చూస్తున్నారు. నిన్న కర్నూలులో సభ పెట్టడానికి కారణం కూడా అదే. సీఎం చంద్రబాబు నాయుడు ముందుగానే ఆలోచించి అన్ని చోట్లకు కంపెనీలను ఇప్పుడే తరలిస్తున్నారు. దీని వల్ల భవిష్యత్ లో రాబోయే కంపెనీలు ఏపీలో ఎక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అయినా సిద్ధంగానే ఉంటాయి.