DEAD: ముగ్గురు మహిళల..అనుమానాస్పద మృతి
కర్నూలులో ముగ్గురు మహిళల అనుమానాస్పద మృతి.... చెరువులో ముగ్గురు మహిళల మృతదేహాలు లభ్యం;
కర్నూలులో ముగ్గురు గుర్తుతెలియని మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం... కలకలం రేపింది. నగరవనం చెరువులో తొలుత ఇద్దరి మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం చెరువు ఒడ్డుపై మరో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...హత్యా లేక ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలు సమీపంలోని నగరవనం చెరువులో ముగ్గరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తొలుత చెరువులో ఇద్దరి మృతదేహాల్ని స్థానికులు గుర్తించి కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. చెరువు ఒడ్డున మరో మృతదేహాన్ని వారు గుర్తించారు. మృతులు ఎవరు? ఎలా చనిపోయారు? అనేది మిస్టరీగా మారింది. మృతదేహాలను శవపరీక్ష కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ముగ్గురు మహిళలు చనిపోవడంతో.... వారిని ఎవరైనా హత్య చేసి చెరువులో పడేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. శవపరీక్షల నివేదిక ఆధారంగా కేసును విచారణ చేస్తామని వారు తెలిపారు. మృతదేహాలను గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తున్నామని... పోలీసులు చెప్పారు.