TTD : కల్తీ నెయ్యి కేసులో ఛార్జ్ షీట్ దాఖలు.. సంచలన నిజాలు..

Update: 2026-01-24 17:15 GMT

ఏపీ చరిత్రలోనే అత్యంత దారుణమైన కేసు కల్తీ నెయ్యి. కోట్లాదిమంది హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డును వైసీపీ హయాంలో కల్తీ చేసి భక్తులతో తినిపించిన ఘోరం అందరికీ తెలిసిందే. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం నడిచింది అనేది ఇప్పటికే సిబిఐ విచారణలో తేలిపోయింది. అయితే ఈ కేసులో బోలేబాబా డెయిరీకి అసలు ఆవులే లేవని.. బయట నుంచి కూడా ఎలాంటి పాలు సేకరించలేదని సిబిఐ తన చార్జ్ షీట్ లో తెలిపింది. కేవలం పామ్ ఆయిల్ ఇతర కెమికల్స్ ను వాడి కల్తీ నెయ్యి తయారు చేసి తిరుమలకు సప్లై చేశారని తేలిపోయింది. ఈ కేసులో దాదాపు అందరి విచారణ పూర్తి అయిపోయింది. ఐదు డెయిరీలు, 31 మంది వ్యక్తులను ఇందులో నిందితులుగా చేర్చింది సిబిఐ. 2019 నుంచి 2024 మధ్య టిటిడి పెద్దలు డెయిరీ నిర్వాహకులు కుమ్మక్కై ఇంత పెద్ద స్కాం చేసినట్టు సిబిఐ ఆధారాలతో సహా నెల్లూరు ఏసీబీ కోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

60 లక్షలకు పైగా కేజీల కల్తీ నెయ్యిని తిరుమలకు ఈ బోలెబాబా డెయిరీ సరఫరా చేసింది. తిరుమలకు ఈ కల్తీ నెయ్యి వల్ల 250 కోట్ల దాకా నష్టం వచ్చినట్టు విచారణలో తేలింది. చిన్న అప్పన్నకు డెయిరీ నిర్వాహకులకు మధ్య కీలక ఒప్పందం జరిగిందని.. హవాలా రూపంలో లంచాలు ముట్టాయని తేలిపోయింది. ఇందులో కీలక నిందితుడిగా వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న ఉన్నారు. బోలె బాబా డెయిరీ కేంద్రంగానే ఈ కల్తీ నెయ్యి దందా సాగినట్లు స్పష్టం చేస్తున్నారు అధికారులు. మరి ఈ ఛార్జ్ షీట్ ఆధారంగా కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News