తిరుమల వేదవిజ్ఞాన పీఠంలో తీవ్ర అస్వస్థతకు గురైన 58 మంది విద్యార్ధులు
వేద పాఠశాలలో 58 మంది విద్యార్ధులు ఒకేసారి తీవ్ర అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది.;
తిరుమల వేద విజ్ఞాన పీఠంలో విద్యాభ్యాసం చేసే విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 450 మంది విద్యార్ధులున్న ఈ వేద పాఠశాలలో 58 మంది విద్యార్ధులు ఒకేసారి తీవ్ర అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. జ్వరం,జలుబు,దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతోన్న విద్యార్ధులను అర్ధరాత్రివేళ హుటాహుటిన తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.
అయితే..అస్వస్థతకు గురైన విద్యార్ధులకు కరోనా పాజిటివ్ అని తేలిందని ప్రసార మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే..వేదపాఠశాల నిర్వాహకులు మాత్రం అటువంటిదేమీ లేదని కేవలం ఫుడ్ పాయిజన్ కావడం వల్లే విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు. అయితే.. టీటీడీ మాత్రం విద్యార్ధుల అస్వస్థతతపై ఇంతవరకు అధికారికంగా స్పందించ లేదు.