Tirupati SVIMS: తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి ఉద్యోగుల నిరసన..
Tirupati SVIMS: 13వేల రూపాయలతో నెలరోజుపాటు కుటుంబాన్ని ఎలా పోషించాలంటూ తిరుపతి స్విమ్స్ ఉద్యోగులు సీఎంను ప్రశ్నిస్తున్నారు.;
Tirupati SVIMS: 13వేల రూపాయలతో నెలరోజుపాటు కుటుంబాన్ని ఎలా పోషించాలంటూ తిరుపతి స్విమ్స్ ఉద్యోగులు సీఎంను ప్రశ్నిస్తున్నారు. పథకాల పేరుతో రాష్ట్ర ఖజానాను ఖాళీచేస్తూ అవసరమైన వాటికి నిధులను మంజూరు చేయడంలేదనివారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 22 ఏళ్లుగా చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషిస్తున్నామన్నామని వారు ఆవేదన వ్యక్తంచేశారు.
తిరుపతి వేదికగా తమకు జీతాలు పెంచుతామని హామిఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదనివారు ఆరోపించారు. ఈసందర్బంగా వైద్యసేవలను బహిష్కరించిన స్విమ్స్ ఆస్పత్రి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేశారు.