ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం నెలకొంది. కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకటరమణ గత రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. మచిలీపట్నంలోని ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోదరుడి మరణవార్త తెలుసుకున్న మంత్రి రవీంద్ర విజయవాడలోని కలెక్టర్ల సమావేశం నుంచి హుటాహుటిన మచిలీపట్నం బయలుదేరి వెళ్ళారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు వెంకటరమణ హఠాన్మరణంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకటరమణ మృతికి సంతాపం తెలిపారు. మంత్రి రవీంద్ర కుటుంబంలో ఇది తీవ్ర విషాదమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం తెలిపారు. కొల్లు వెంకటరమణ వ్యాపారవేత్త. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.